సీబీఎస్ఈ  పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది కేంద్రం. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 15న ఫలితాలు రానున్నాయి.

సాధారణంగా సీబీఎస్ఈ షెడ్యూల్ నవంబర్‌లోనే విడుదలవుతుంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు జరుగుతాయి. అయితే ఈసారి కరోనా కారణంగా పరీక్షలు కొంత ఆలస్యమవుతున్నాయి.

ఈ నెల 22న విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ టీచర్లతో సమావేశమయ్యారు. సీబీఎస్ఈ పరీక్షలపై ఆరోజే క్లారిటీ ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా మార్చి-ఏప్రిల్ మధ్యలో నిర్వహించే పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని కేంద్రమంత్రి తెలిపారు.

అయితే, సిలబస్ మాత్రం తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. 30 శాతం సిలబస్ తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.