Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ జ‌డ్జి హ‌త్య‌ కేసు.. రంగంలోకి సీబీఐ, ధన్‌బాద్‌కి ప్రత్యేక బృందాలు

జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ధన్‌బాద్‌కు పంపారు సీబీఐ ఉన్నతాధికారులు
 

CBI Takes Over Probe Into Jharkhand Judges Death In Hit And Run Case ksp
Author
Dhanbad, First Published Aug 4, 2021, 7:37 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్ఖండ్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ధన్‌బాద్‌కు పంపారు సీబీఐ ఉన్నతాధికారులు. ఇప్పటికే జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్ట్ ఆరా తీసిన సంగతి తెలిసిందే. 

కాగా, ధన్‌బాద్ అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతిపై జిల్లా పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ చేస్తోంది.బుధవారం నాడు మార్నింగ్ వాక్ కు వెళ్లిన  ఉత్తమ్ ఆనంద్ ను అనుమానాస్పద స్థితిలో తన ఇంటికి సమీపంలోనే మరణించాడు. మార్నింగ్ వాక్ చేస్తున్న జడ్జిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ వాహనం ఉద్దేశ్యపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్టుగా సీసీటీవీదృశ్యాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read:జార్ఖండ్‌లో జడ్జి అనుమానాస్పద మృతి: సుప్రీంకోర్టులో ప్రస్తావన, పోలీసుల దర్యాప్తు

ఈ విషయమై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ  జార్ఖండ్ హైకోర్టు  చీఫ్ జస్టిస్ తో ఫోన్‌లో మాట్లాడారు.  ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేస్తోంది. ధన్‌బాద్ జిల్లా పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.పలు మాఫియా కేసులను జడ్జి విచారణ చేస్తున్నారు.అయితే  జడ్జి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios