ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన కుటుంబ సభ్యులను  కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసుకు సంబందఇంచి ఈడీ అధికారులు.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. 

ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన కుటుంబ సభ్యులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసుకు సంబందఇంచి ఈడీ అధికారులు.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తేజస్వీ యాదవ్‌ను మార్చి 4వ తేదీన విచారణకు పిలిచామని.. అయితే ఆయన అధికారుల ఎదుట హాజరు కాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం(మార్చి 11) విచారణకు హాజరు కావాల్సిందిగా కోరినట్టుగా తెలిపారు. తేజస్వీ యాదవ్‌ను శనివారం ఉదయం విచారణకు హాజరుకావాల్సిందిగా కోరామని.. అయితే ఆయన ఇంకా తమ కార్యాలయానికి రాలేదని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ‘ఉద్యోగాల కోసం భూమి’ కేసుకు సబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని తేజస్వీ యాద్ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇతర ప్రాంతాలు, పాట్నా, రాంచీ, ముంబై సహా 24 ప్రదేశాలలో ఈడీ సోదాలు చేపట్టింది. 

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను ఢిల్లీలో, ఆయన భార్య రబ్రీ దేవిని పాట్నాలో సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మార్చి 7వ తేదీన లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ ఐదు గంటలపాటు ప్రశ్నించింది. ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత ఢిల్లీలోని తన కూతురు మీసా భారతి నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. సీబీఐ ఆ ఇంటికి వెళ్లి ప్రశ్నలు వేసింది. అంతకు ముందటి రోజు పాట్నాలోని నివాసంలో లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించింది.

ఇక, రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం కొందరి నుంచి భూమిని లంచంగా పొందారనే ఆరోపణలతో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో లాలూ యాదవ్ కుటుంబ సభ్యులు, ఇతర నేతలతోపాటు ఈ ఉద్యోగం పొందారనే ఆరోపణలతో 12 మంది పై కేసు ఫైల్ అయింది.