ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్) దాడులు చేపడుతోంది. దీనిని మనీష్ సిసోడియా స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం ఉదయం దాడులు నిర్వ‌హిస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించే ఈ రైడ్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాన్ని సిసోడియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ధృవీకరించారు.

ముగ్గురు పిల్లల్ని, భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. వీడియో కాల్స్ చేసి హింస.. తట్టుకోలేక ఆ భర్త చేసిన ప

ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ‘‘ సీబీఐ వచ్చింది. వారికి స్వాగ‌తం. మేము చాలా నిజాయితీగా ఉన్నాం. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. మన దేశంలో మంచి పనులు చేసే వారిని ఇలా వేధించడం చాలా దురదృష్టకరం. అందుకే మన దేశం ఇంకా నంబర్-1గా మారలేదు. ’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

“మేము సీబీఐని స్వాగతిస్తున్నాము. త్వరలో నిజానిజాలు బయటకు వచ్చేలా విచారణకు పూర్తి సహకారం అందిస్తాం. ఇప్పటి వరకు నాపై ఎన్నో కేసులు పెట్టారు. ఒక్క‌టి కూడా రుజువు కాలేదు. దీని నుంచి కూడా ఏమీ రాదు. దేశంలో మంచి విద్య కోసం నేను చేస్తున్న కృషిని ఆపలేరు.’’ అని ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిసోడియా పేర్కొన్నారు. “ ఢిల్లీ విద్య, ఆరోగ్యం కోసం మేము చేస్తున్న అద్భుతమైన పనిని చూసి కొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎడ్యుకేషన్ హెల్త్ అనే మంచి పనిని ఆపడానికి ఢిల్లీలోని ఆరోగ్య మంత్రి, విద్యా మంత్రిని అరెస్టు చేశారు. మా ఇద్దరిపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో నిజం బయటపడుతుంది ’’ అని ఆయన పేర్కొన్నారు. 

Donald Trump భారత్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గత వారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఎంసీడీలో రూ.6,000 కోట్ల టోల్ టాక్స్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 6,000 కోట్ల టోల్ టాక్స్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎల్‌జీకి లేఖ రాశాను. ప్రతిరోజు ఢిల్లీకి వచ్చే వాణిజ్య వాహనాల నుంచి సేకరించిన సొమ్మును పక్కదారి పట్టించారు ’’ అని సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు.

రెండు టోల్ టాక్స్ కంపెనీలను ఢీకొట్టి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించిందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.