తమిళనాడులో సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. వీరిలో డీజీపీ టీకే రాజేంద్రన్, మంత్రి విజయ్ భాస్కర్, చెన్నై మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ నివాసాలు కూడా ఉన్నాయి. గుట్కా స్కాంలో దర్యాప్తులో భాగంగానే సీబీఐ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో గుట్కా స్కామ్ తమిళనాడులో సంచలనం కలిగించింది. నిషేధిత గుట్కా వ్యాపారం చేసుకునేందుకు అనుమతించినందుకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్‌, నాటి చెన్నై పోలీస్ కమిషనర్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రన్‌కు భారీగా ముడుపులు అందాయన్న ప్రచారం జరిగింది. దీనిపై డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో.. కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది.