CBI Raids: FCRA ఉల్లంఘన కేసులో దేశవ్యాప్తంగా CBI భారీ ఆపరేషన్, 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సహా 10 మందిని అరెస్టు చేసింది.
CBI Raids: దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది. విదేశీ విరాళాలను స్వీకరించడం(FCRA) లో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలపై ఈ దాడులు నిర్వహించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ని ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ తరపున సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీని తర్వాత, సీబీఐకి చెందిన డజను బృందాలు రంగంలోకి దిగాయి. ఏకకాలంలో ఢిల్లీ, జైపూర్, కోయంబత్తూర్, మైసూర్ సహా 40 ప్రాంతాల్లో దాడులు చేశాయి. దేశవ్యాప్తంగా ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూరు, మైసూర్ మరియు రాజస్థాన్‌లోని కొన్ని ప్రదేశాలతో సహా దాదాపు 40 చోట్ల దాడులు నిర్వహించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవోలు) ప్రతినిధులు, మధ్యవర్తులపై ఒప్పందం జరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్‌సిఆర్‌ఎ 2010ని ఉల్లంఘించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు, ఎన్‌జిఓల ప్రతినిధులు, మధ్యవర్తులు విదేశీ గ్రాంట్‌లను స్వీకరించడానికి డబ్బును లావాదేవీలు చేసినట్లు ఆపరేషన్ సమయంలో కనుగొనబడింది. ఈ కేసుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులతో సహా 10 మందిని ఏజెన్సీ ఇప్పటివరకు అరెస్టు చేసింది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో రూ.2 కోట్ల హవాలా లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ దాడిలో కేసుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు .
ఇదిలావుండగా, ముంబైలోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కార్యాలయానికి భవనాన్ని కొనుగోలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్యాంక్ మాజీ చైర్మన్ హసీబ్ ద్రాబుతో పాటు మరికొందరు మాజీ ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ముంబైలోని తన ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కోసం సుమారు రూ. 180 కోట్లకు ఆకృతి గోల్డ్ బిల్డింగ్‌ను బ్యాంక్ కొనుగోలు చేసినందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏజెన్సీ గత ఏడాది నవంబర్ 11న ముంబై, శ్రీనగర్ మరియు జమ్మూలోని ఎనిమిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సూచన మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు.
