New Delhi: బీఎస్ఎన్ఎల్ సీనియ‌ర్ అధికారుల‌పై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు న‌మోదుచేసింది. అక్ర‌మాస్తుల విష‌యంతో పాటు సంస్థ‌ను మోస‌గించే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారనే ఆరోప‌ణ‌ల‌తో ఈ కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే సీబీఐ అధికారులు దేశంలోని 25 చోట్ల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కేసులు న‌మోదైన వారిలో మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సహా ప‌లువురు సీనియ‌ర్ అధికారులు ఉన్నారు. 

CBI books senior BSNL officials for Corruption: బీఎస్ఎన్ఎల్ సీనియ‌ర్ అధికారుల‌పై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు న‌మోదుచేసింది. అక్ర‌మాస్తుల విష‌యంతో పాటు సంస్థ‌ను మోస‌గించే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారనే ఆరోప‌ణ‌ల‌తో ఈ కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే సీబీఐ అధికారులు దేశంలోని 25 చోట్ల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కేసులు న‌మోదైన వారిలో మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సహా ప‌లువురు సీనియ‌ర్ అధికారులు ఉన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. మాజీ జనరల్ మేనేజర్ సహా 25 మంది బీఎస్ఎన్ఎల్ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ కు సంబంధించి సీబీఐ 21 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను మోసం చేసేందుకు ఓ కాంట్రాక్టర్ తో కలిసి నిందితులు కుట్ర పన్నారని ప్రధాన దర్యాప్తు సంస్థ ఆరోపించింది. జోర్హాట్, సిబ్సాగర్, గౌహతి తదితర ప్రాంతాల్లోని మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సహా బీఎస్ఎన్ఎల్ అస్సాం సర్కిల్ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో ఓ ప్ర‌యివేటు వ్యక్తి పేరు కూడా ఉందని అధికారులు తెలిపారు.

ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుల్ వేయడానికి కిలోమీటరుకు రూ.90,000 చొప్పున కాంట్రాక్టర్ కు వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు సీబీఐ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పందంలో రైట్ ఆఫ్ వే, ఈజ్మెంట్ క్లాజ్ ఉన్నప్పటికీ ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిని కిలోమీటరుకు రూ.2.30 లక్షల చొప్పున హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ పద్ధతిగా మార్చాలని ప్ర‌యివేటు భూమి యజమాని నుంచి ఎలాంటి దారి హక్కు లేకుండా కాంట్రాక్టర్ వివిధ అభ్యర్థనలు చేశారనీ, తద్వారా టెండర్ క్లాజును ఉల్లంఘించి బీఎస్ఎన్ఎల్ కు రూ.22 కోట్లు (సుమారు) నష్టం కలిగించారని ఆరోపించారని ఆ అధికారి తెలిపిన‌ట్టు ఎన్డీటీవీ నివేదించింది. ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానాలోని నిందితుల కార్యాలయాలు, నివాసాలతో సహా 25 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది.