జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ లీక్ నిందితుడు వినయ్ దహ్య ఎట్టకేలకు సీబీఐ చేతికి చిక్కాడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ లీక్ నిందితుడు వినయ్ దహ్య ఎట్టకేలకు సీబీఐ చేతికి చిక్కాడు. హర్యానాలో శనివారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. 2021 నుంచి వినయ్ సీబీఐ డేగ కళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ పలు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
