నీట్ యూజీ 2022 పరీక్షల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాశారని సీబీఐ అధికారులు గుర్తించారు. పరీక్ష రాసిన తర్వాత నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సీబీఐ ప్రకటించింది.  

న్యూఢిల్లీ: NEET యూజీ-2022 పరీక్షల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఎనిమిది మందిని సీబీఐ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ నెల 17న నీట్ ప్రవేశ పరీక్షజరిగింది.ఈ పరీక్షలో ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాశారని CBI అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రిగ్గింగ్ రాకెట్ తో ప్రమేయం ఉందనే అనుమానంతో ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అభ్యర్ధుల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లను నిందితులు సేకరించారని అధికారులు చెప్పారు. అభ్యర్ధులు కోరుకున్న పరీక్షా కేంద్రాలను పొందేందుు అవసరమైన సవరణలు చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ విషయమై భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

ఒకరికి బదులుగా మరొకరు Exam రాసేందుకు గాను నిందితులు ఫోటో గ్రాఫ్ ల మిక్సింగ్, మార్పింగ్ కు కూడా పాల్పడినట్టుగా సీబీఐ FIR లో పేర్కొంది. NEET -UG ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్‌సీ నర్సింగ్ కోర్సులను అభ్యసించేందుకు అనుమతి దక్కనుంది.
నిందితులు కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించి గుర్తింపు కార్డులను మార్పింగ్ చేసి పరీక్ష హాల్ లోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షల్లో 18 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఘటనపై 123 బీ, 419, 420,467 , 466, 471 సెక్షన్ల కింద నిందితులను అరెస్ట్ చేశారు.

Delhiలోని గౌతమ్ నగర్ కు చెందిన సుశీల్ రంజన్ ను సీబీఐ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితులు పరీక్షకు ఒక్క రోజు ముందే ఢిల్లీలోని హోటల్ లో బస చేశారు. ఈ విషయమై పరీక్ష పూర్తైన తర్వాత నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా సీబీఐ అధికారులు తెలిపారు. 
కీలక సూత్రధారితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీ, హర్యానాలో ఈ కుట్ర జరిగిందని జరిగినట్టుగా సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సుశీల్ రంజన్ , బిర్దూ మోహన్ సింగ్, పప్పూ,ఉమాశంకర్, నిధి, కృష్ణ శంకర్,యోగి సన్నీరాజన్, రఘునందన్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.