Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్: ఇన్ కమ్ ట్యాక్స్ గడువు మరోసారి పెంపు

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రభుత్వం గడువునుమరోసారి పొడిగించింది. 31 జులై 2020 నుంచి సెప్టెంబర్ 30 2020 వరకు గడువు కాలాన్ని పెంచింది.

CBDT extends FY19 income tax return filing deadline till September 30 in the wake of COVID-19
Author
Mumbai, First Published Jul 30, 2020, 9:25 AM IST

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రభుత్వం గడువునుమరోసారి పొడిగించింది. 31 జులై 2020 నుంచి సెప్టెంబర్ 30 2020 వరకు గడువు కాలాన్ని పెంచింది. కరోనా వైరస్ వల్ల ఉన్న పరిస్థితి దృష్ట్యా ఈ విధంగా గడువును పొడిగిస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. 

ఇప్పటికే ప్రభుత్వం పన్నులు ఫైల్మార్చ్ 31 గా ఉన్న డేటును జూన్ నెలాఖరు వరకు తొలిసారి పొడిగించింది. అక్కడి నుండి మరోమారు జులై 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ముచ్చటగా మూడవసారి కూడా కేంద్రం ఈ డెడ్ లైన్ ను పొడిగించింది. 

ఈ డెడ్ లైన్ ల; రిటర్న్ ఫైల్ చేయకపోతే అతడు 2018-19 సంవత్సరానికిగాను ఐటీ ఫైల్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు. ఎవరైనా రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్న కూడా చేయొచ్చని అధికార వర్గం తెలిపింది. నిన్న రాత్రి పొద్దుపోయాక ఈ విషయాన్నీ సీబీడీటీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios