Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో యువతుల వీరంగం .. న‌డిరోడ్డుపై అందరూ చూస్తుండగానే  ఓ మహిళపై దారుణం..

ఇండోర్‌లోని ఎల్ఐజీ ఇంట‌ర్‌సెక్షన్ స‌మీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట మద్యం మత్తులో బాలికలు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి నలుగురు అమ్మాయిలు ఓ అమ్మాయిని దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Caught on cam: Woman brutally thrashed by gang of girls as onlookers watch
Author
First Published Nov 8, 2022, 3:03 PM IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో నలుగురు బాలికలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ యువతిని న‌లుగురు యువ‌తులు ఒంటరి దాన్ని చేసి.. నడిరోడ్డుపై తోసివేసి అత్యంత దారుణంగా కొట్టారు. విచక్షణరహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు.  మొబైల్ కూడా ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న ఇండోర్‌లోని ఎల్ఐజీ ఇంట‌ర్‌సెక్షన్ స‌మీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట న‌వంబ‌ర్ 4 రాత్రి జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను తుషార్ శ్రీవాస్త‌వ అనే వ్యక్తి తన ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతిపై మద్యం మత్తులో ఉన్న నలుగురు యువ‌తులు దాడి చేశారు. విచక్షణ రహితంగా  వ్యవహరించారు. పిడిగుద్దులతో ఆ యువతిపై విరుచుకుప‌డ్డారు. అందరూ చూస్తుండగానే బాధితురాలిని నడిరోడ్డుపై కిందతోసివేసి.. బెల్ట్‌తో, కర్రతో కొడుతుండ‌టం చూడవచ్చు. ఈ దారుణం జరుగుతున్నప్పుడూ రోడ్డుపై జనం గుమిగూడారు. ఆ దారుణాన్ని అక్కడి వారు చూస్తునే ఉన్నారు. వీడియోలు చేసారు, కానీ, ఎవరూ ఆ బాధితురాలిని రక్షించడానికి ప్రయత్నించలేదు. ఈ విషయం కూడా ఆ వీడియో చూడవచ్చు. శుక్రవారం రాత్రి ఎల్‌ఐజీ కూడలి సమీపంలో ఈ దాడి ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోమవారం బయటకు వచ్చింది.

ఎంఐజీ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌చార్జ్ అజ‌య్ వ‌ర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 4) ప్రియా వర్మ నెహ్రూ నగర్‌లోని ఆర్జే కచోరి ఎదుట ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువ‌తులు అక్కడ చాట్ తినడానికి వచ్చిన ప్రియా వర్మ అనే అమ్మాయితో వాగ్వాదానికి దిగాడు. ఆ వివాదం కొన్ని క్షణాల్లోనే గొడవగా మారింది. రోడ్డుపై అందరూ చూస్తుండ‌గా  ఆ యువతులు బాదితురాలని  తన్నడం, కొట్టడం, జుట్టు లాగడం. ఓ అమ్మాయి ఆ అమ్మాయిని బెల్టుతో కూడా కొట్టడం. మరో అమ్మాయి బాధితురాలి ఫోన్ ను  పగలగొట్టింది. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ యువతిని కొట్టి గాయ‌ప‌రిచార‌ని అజ‌య్ వ‌ర్మ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆ న‌లుగురు యువ‌తుల‌ను ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు చేపట్టామని తెలిపారు.  

బీఆర్‌టీఎస్‌ మార్కెట్‌ 24 గంటలు తెరిచి ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 24 గంటలూ రెస్టారెంట్ లు తెరిచి ఉండటం వల్ల మద్యం మత్తులో యువకులు వచ్చి గొడవ పడుతున్నారు. ఈ కూడలిలో పగటిపూట పోలీసులు వాహనాలకు చలాన్లు విధిస్తున్నా.. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ తక్కువగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. రాత్రిపూట మత్తులో మునిగితేలుతున్న యువతియువకులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios