Asianet News TeluguAsianet News Telugu

ఆ కేసులో ఈడీ ముందు హాజరైన తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్ కుమార్తె

జంతువుల అక్రమ రవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అనుబ్రత మోండల్ కుమార్తె సుకన్య  బుధవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలోనే ఆమెను ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సిగా ఆదేశించినా..  ఆమె వ్యక్తిగత కారణాల రీత్యా మరింత గడువు కోరారు.

Cattle Smuggling Scam: TMC Leader Anubrata Mondal Daughter Sukanya Mondal Reaches ED Headquarters
Author
First Published Nov 2, 2022, 3:42 PM IST

జంతువుల అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అనుబ్రత మోండల్ కుమార్తె సుకన్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ పిలిచింది. మేరకు ఆమె ఇవాళ  ఉదయం (బుధవారం) ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. సుకన్యను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

జంతువుల అక్రమ రవాణా కేసులో కోట్లాది రూపాయల కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో అనుబ్రత మండల్ బాడీగార్డ్ అహ్గల్ హుస్సేన్‌ను ఈడీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అదే సమయంలో జంతువుల అక్రమ రవాణా కేసును కూడా సీబీఐ ప్రత్యేకంగా విచారిస్తోంది.

అంతకుముందు.. అక్టోబర్ 27న సుకన్యను ఈడీ ఢిల్లీకి పిలిపించింది, అయితే సుకన్య బెంగాల్‌కు దూరంగా ఉన్నందున ఢిల్లీకి వెళ్లలేదు. ఆ తర్వాత సుకన్యకు ఈడీ రెండోసారి నోటీసు పంపగా, దానిపై సుకన్య దేశ రాజధానికి వెళ్లింది.

సుకన్యతో పాటు ఆమె అకౌంటెంట్ మనీష్ కొఠారీ, తృణమూల్ నాయకుడు రాజీవ్ భట్టాచార్య ఉన్నారు. వారిద్దరినీ కూడా ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీటులోనూ సుకన్య ఆస్తుల వివరాలను పేర్కొనడం గమనార్హం.

ఈడీ సమాచారం ప్రకారం..  ఏఎన్ఎం ఆగ్రోకెమ్ ప్రైవైట్ లిమిటెడ్, నీర్ డవలపవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు సుకన్య డైరెక్టర్‌గా ఉన్నారు. పశువుల కుంభకోణం దర్యాప్తుతో పాటు సమాంతరంగా ఈ కంపెనీల వ్యవహారంపై కూడా ఈడీ, సీబీఐ ఇప్పటికే దర్యాప్తు సాగిస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సుకన్య ఆదాయం 3.10 లక్షలు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.45 కోట్లకు పెరిగినట్టు  చార్జిషీట్‌లో పేర్కొంది. అలాగే.. సుకన్య పేరిట కనీసం రూ.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు సీబీఐకి తెలిసింది. వీటిపై కూడా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది.

జ్యుడీషియల్ కస్టడీలో అనుబ్రత మండల్  

జంతువుల అక్రమ రవాణా కేసులో  టీఎంసీ నేత అనుబ్రత మండల్ అక్టోబర్ 11న మండల్‌ని బోల్‌పూర్ నివాసం నుంచి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల..అనుబ్రతా మోండల్ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత అతని జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించబడింది.నవంబర్ 11 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios