కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. ఇది సమాజానికి పట్టిన అనారోగ్యం అని తెలిపారు. దీనిపై సహనంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్‌లో టీచర్ చేతిలో దళిత బాలుడు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, లోక్ సభ మాజీ స్పీకర్ మాట్లాడారు. కుల వ్యవస్థ అనే రోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని, పక్షపాతానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని అన్నారు. ఈ మేరకు ఆమె PTI ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇన్నేళ్లుగా కుల వ్యవస్థ పలచబడలేదని, నిర్మూలించబడలేదని లోక్‌సభ మాజీ స్పీకర్ నొక్కి చెప్పారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా అని అడిగిన ప్రశ్నకు మీరా కుమార్ సమాధానం ఇస్తూ.. ‘‘ ఇది అందరూ నన్ను అడిగే విషయమే. నేను ఎవరినీ సమర్థిస్తున్నానని లేదా ఎవరినీ దూషిస్తున్నానని కాదు. అవును అని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. రాజకీయ వర్గం కొంత వరకు బాధ్యత వహిస్తుంది కానీ సమస్య సామాజికమైనది. రాజకీయాలు సమాజానికి ప్రతిబింబం ’’ అని తెలిపారు.
చండీగఢ్, మొహాలీలకు ఉగ్రదాడుల హెచ్చరిక.. అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు
ప్రజలు రాజకీయ కోణాల గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు అది సమస్యను పలుచన చేస్తుందని మీరా కుమార్ అన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనపై ముందుకు వెళ్లే మార్గాల గురించి ఆమె మాట్లాడుతూ సామాజిక సంకల్పం అవసరమని కుమార్ అన్నారు. కాగా కులం, మతం, చర్మం రంగు, ఆర్థిక నేపథ్యం వంటి పక్షపాతాలను పారద్రోలాల్సిన అవసరం ఉందని మీరా కుమార్ ఇటీవల ట్వీట్ చేశారు. 100 సంవత్సరాల కిందట తన తండ్రి బాబు జగ్జీవన్ రామ్ పాఠశాలలో కూడా సవర్ణ హిందువులు కాడ నుంచి నీరు తాగకుండా నిషేధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే కారణంతో తొమ్మిదేళ్ల దళిత బాలుడు హత్యకు గురయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ కుల వ్యవస్థ మనకు అతి పెద్ద శత్రువు అని తెలిపారు.
‘‘ చాలా పక్షపాతాలు ఉన్నాయి. వాటిని తరిమేయడానికి మనం చిన్నతనం నుండే చర్యలు చేపట్టాలి. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నట్టే, దీనిపై కూడా అలాంటి విధానాన్నే అనుసరించాలి ’’ అని చెప్పారు. కులవ్యవస్థ ఒక అనారోగ్యమని, అది పోతే తప్ప దురాగతాలు ఆగవని ఆమె అన్నారు. కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంపై దృష్టి సారించాలని ఆమె అన్నారు.
బీహార్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందన ఏంటని ప్రశ్నించగా.. ఇది స్వాగతించాల్సిన విషయం అని, సానుకూల సాంకేతం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిని అనుసరిస్తారని తాను ఆశిస్తున్నానని ఆమె అన్నారు. బీహార్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు లభించాయని కొన్ని వర్గాల నుండి వచ్చిన సూచనలపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఈ అంశాలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలి, దీనిపై సానుకూలంగా ఉండాలి ’’ అని అన్నారు.
రిక్రూట్‌మెంట్ పరీక్షలో చీటింగ్ అడ్డుకోవడానికి సంచలన నిర్ణయం.. ఆ 4 గంటలు ఇంటర్నెట్ బంద్
మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడటం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆశాజనకంగా ఉందా లేదా అనే దానిపై కుమార్ మాట్లాడుతూ.. ‘‘ అవును. కానీ చాలా వర్గీకరణ ఉండకూడదు, మనం దానిని నిర్మించాలి. దానిని బలోపేతం చేయడానికి, దానిని పెంచుకోవడానికి సమయం ఇవ్వాలి, ఆపై అంతటా వ్యాపించి అదే జరుగుతుంది ’’ అని ఆమె తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా మారొచ్చు అని చర్చ జరుగుతోందని, దీనిపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు.. ‘‘ నేను వివిధ వర్గాల నుండి ఈ విషయం విన్నాను, అక్కడ ఎవరు ఉన్నారో చూద్దాం, ప్రతిపక్షంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. తగిన సమయంలో పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. ’’ అని ఆమె అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సహా అనేక మంది ప్రతిపక్ష నేతలను ప్రశ్నిస్తూ కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
