బీహార్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు.. క్యాష్ వ్యాన్‌పై దాడి చేసి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లారు. ముజఫర్‌పూర్‌లో ఈ ఉదయం ఏటీఎంలో నగదును నింపడానికి వెళుతున్న ఓ క్యాష్‌ వ్యాన్‌ను సరాయ్ ప్రాంతంలో అడ్డగించిన దుండగులు సొమ్ము ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు.

వీరి ప్రయత్నాన్ని సెక్యూరిటీ గార్డు బినోద్ సింగ్ అడ్డుకునేందుకు యత్నించాడు.. దీంతో దుండగులు గార్డుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి రూ.52 లక్షలు అపహరించుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు సెక్యూరిటీ గార్డును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆయన శరీరం నుంచి వైద్యులు రెండు బుల్లెట్లను వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.