నిధుల దుర్వినియోగం కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త ఈరోజు కేసును స్వీకరించింది.

కేరళ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన ప్రభుత్వం రాష్ట్ర సహాయ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల మీద ఈ రోజు లోకాయుక్త విచారించింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులలు ఈ విషయంలో విభేదించడంతో పెద్ద బెంచ్‌కు రిఫర్ చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎండీఆర్‌ఎఫ్)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పినరయి విజయన్, పలువురు మంత్రులు ప్రతివాదులుగా ఉన్నారు.

 గత వారం కేరళ హైకోర్టు పిటిషనర్‌ను లోకాయుక్తను సంప్రదించాలని కోరడంతో లోకాయుక్త ఈరోజు కేసును స్వీకరించింది. ఈ కేసులో విచారణలు ఏడాది క్రితమే పూర్తయ్యాయని వాదిస్తూ నిర్ణయం కోసం ఆర్ఎస్ శశికుమార్ అనే కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. రిలీఫ్ డబ్బు పంపిణీలో బంధుప్రీతి ఉందని పిటిషన్ ఆరోపించింది. లబ్ధిదారులలో మరణించిన సీపీఐ(ఎం) శాసనసభ్యుని కుటుంబం, మరణించిన వామపక్ష మిత్రుడి కుటుంబం, ప్రమాదంలో మరణించిన కేరళ పోలీసు అధికారి కుటుంబం ఉన్నారు. ఆ సమయంలో సీపీఐ(ఎం) నేత కొడియేరి బాలకృష్ణన్‌ వెంట ఉన్నారు.

రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదు - కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

2019లో, కార్యకర్త ఫిర్యాదును అంగీకరిస్తూ, కేరళ లోకాయుక్త విజయన్, కొంతమంది మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణల్లో మెరిట్ ఉందా అనే అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు విభేదించారు. ‘‘కేబినెట్‌లో సభ్యులుగా అభ్యంతరకర నిర్ణయాలను తీసుకోవడంలో ప్రతివాదులు చర్యలు తీసుకోవాలా, వద్దా అనే ప్రాథమిక అంశంపై మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున, కేరళ లోకాయుక్త చట్టం, 1999లోని నిబంధనల ప్రకారం విచారణకు లోబడి ఉండవచ్చు. 

ఫిర్యాదుదారు లేవనెత్తిన ఆరోపణల మెరిట్‌లు, కేరళ లోకాయుక్త చట్టం, 1999లోని సెక్షన్ 7(1) ప్రకారం లోకాయుక్త, ఉప-లోకాయుక్తలు రెండూ కలిసి విచారణ కోసం ఈ ఫిర్యాదును చూడొచ్చా.. అనే అంశాల్లో విభేదించాం’ అని న్యాయమూర్తులు తెలిపారు. రాష్ట్ర వాచ్‌డాగ్ అధికారాలను సవరించే బిల్లు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో లోకాయుక్త ముఖ్యమంత్రిపై కేసును విచారిస్తోంది.

ఏప్రిల్ 2021లో, లోకాయుక్త తీర్పుతో అప్పటి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కెటి జలీల్ అధికారాలను దుర్వినియోగం చేయడం, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు అభియోగాలు మోపడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.