Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి అరిష్టాలు పోతాయని.. పునాదిలో బాలుడి బలి, రక్తం కళ్లచూశారుగా

ఓ వైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు సైతం పోటీ పడుతుంటే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మదనపల్లిలో సొంత తల్లిదండ్రులనే కన్నబిడ్డలను బలి ఇచ్చారు. నిరక్ష్యరాస్యులతో పాటు పీహెచ్‌డీలు చేసిన వారు సైతం సాధువులు, దొంగ బాబాల మాయలో పడిపోతున్నారు.

case filed against 4 members kills boy in karnatakas haveri ksp
Author
Haveri, First Published Mar 24, 2021, 9:33 PM IST

ఓ వైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు సైతం పోటీ పడుతుంటే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మదనపల్లిలో సొంత తల్లిదండ్రులనే కన్నబిడ్డలను బలి ఇచ్చారు.

నిరక్ష్యరాస్యులతో పాటు పీహెచ్‌డీలు చేసిన వారు సైతం సాధువులు, దొంగ బాబాల మాయలో పడిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఇదే తరహాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు పునాది తవ్వుతూ ఎలాంటి అరిష్టాలు కలగకుండా ఉండేదుకు గాను బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే దీనిని స్థానికులు అడ్డుకుని బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. హావేరి జిల్లా హానగల్‌ తాలూకా ఉపుఉనసి గ్రామంలో హరీశయ్య నాగయ్య హిరేమఠ అనే బాలుడిని కొందరు చిత్రహింసలకు గురి చేసి కొత్త ఇంటి పునాదిలో వేయడానికి ప్రయత్నించారు.

విషయం తెలుసుకున్న కొందరు ఈ దారుణాన్ని అడ్డుకొని, బాలుడిని హుబ్లీ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో ఆ కుర్రాడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.  

ఈ ఘటనపై హరూరు పోలీస్‌ స్టేషన్‌లో బాలుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు శివరుద్ర హావేరి, బసన్నవ్వ ప్రభాకర్‌ కరిశెట్టర్, ప్రవీణ్‌ కరిశెట్టర, కుమార వీరభద్రప్ప హావేరిలను అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios