శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ ఎఫ్ఐఆర్ న‌మోదయింది.  త‌మ‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ ఓ బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌పై ఢిల్లీలోని మండవాలి పోలీస్ స్టేష‌న్‌లో సంజ‌య్ రౌత్‌పై ఐపీసీ సెక్ష‌న్లు 509, 500 కింద కేసు న‌మోదైంది.   

Sanjay Raut : మ‌హారాష్ట్ర శివ‌సేన నేత, రాజ్యసభ ఎంపీ సంజ‌య్ రౌత్ త‌మ‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని ఓ బీజీపీ మ‌హిళా కార్య క‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయ‌న‌పై ఢిల్లీలోని మండవాలి పోలీస్ స్టేష‌న్‌లో సంజ‌య్ రౌత్‌పై ఐపీసీ సెక్ష‌న్లు 509, 500 కింద కేసు న‌మోదైంది.సంజ‌య్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని బీజేపీ నాయకుడిని అనుచిత పదజాలంతో బెదిరించిన ఆరోపణలపై శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఢిల్లీలో అరెస్టయ్యారు. పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.సంజయ్ రౌత్ ఒక టీవీలో బీజేపీ నాయకుడిని బహిరంగంగా బెదిరించారు. కార్యక్రమం మరియు నాయకుడి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయబడింది.

ఈ ఘ‌ట‌న‌పై సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. 'చుటియా' అనే ప‌దం వాడినందుకు త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని, హిందీ డిస్క‌న‌రీ ప్ర‌కారం ఆ ప‌దానికి అర్థం.. 'తెలివి తక్కువ' అని, ప్ర‌తిప‌క్షాల ఒత్తిడి మేర‌కే త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని సంజ‌య్ ఆరోపించారు. గ‌తంలో కొంద‌రు బీజేపీ నేత‌లు మ‌హిళా నేత‌ల‌పై అభ్యంత‌రకర వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ వారిపై ఎందుకు కేసులు పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. 

Read Also : Amaravati Farmers padayatra: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు.. తిరుపతిలో సభకకు అనుమతివ్వాలని..

ఆరోపణ ప్రకారం.. డిసెంబర్ 9న శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ బీజేపీ కార్యకర్తలపై కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీప్తి రావత్ భరద్వాజ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదే రోజు మండవాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Read also: జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో షాక్... రివ్యూ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం

ఓ న్యూస్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ పరుష పదజాలం ఉపయోగించారని, బీజేపీ కార్యకర్తల కాళ్లు విరగ్గొట్టి చంపేస్తానని బెదిరించారని దీప్తి రావత్ భరద్వాజ్ పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 (పరువునష్టానికి శిక్ష) , సెక్షన్ 509 (మహిళల మర్యాదను కించపరిచేలా మాటలు, హావభావాలు లేదా చర్యలు) కింద సంజయ్ రౌత్‌పై కేసు నమోదు చేశారు. కేసులో విచారిస్తున్న‌ట్టు తెలిపారు.

ఇటీవ‌ల సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేసి చిక్కుల్లో పడ్డారు. చైనా, పాకిస్థాన్‌లపై భారత్‌ ఇటీవలి సైనిక ప్రతిస్పందనలో జనరల్‌ రావత్‌ కీలక పాత్ర పోషించారు. అందుకే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు సామాన్యుల మదిలో రకరకాల ప్రశ్నలు మెదులుతాయి.