అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు ఖలిస్తానీ గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ను కొంతమంది జర్నలిస్టులకు పంపడంతో అస్సాం పోలీసులు కేంద్ర ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. అతని భద్రతను పటిష్టం చేశారు. గ్రూప్‌పై యూఏపీఏ కింద కేసు నమోదైంది. అస్సాం సీఎంకు Z+ కేటగిరీ కల్పించారు.
పంజాబ్ లో గత నెల రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అతని గురించి,అతని అనుచరుల గురించి వేట కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ ను చంపేస్తామంటూ ఖలిస్థానీ మద్దతుదారు ఒకరు బెదిరింపులకు పాల్పడ్డారు.
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు వ్యతిరేకంగా ఖలిస్తానీ బృందం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వినిపిస్తున్న ఆడియో క్లిప్‌ను కొంతమంది జర్నలిస్టులకు పంపడంతో అస్సాం పోలీసులు కేంద్ర ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో అతనికి భద్రతను పటిష్టం చేశారు.
సదరు గ్రూప్‌పై యూఏపీఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాం ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ కల్పించినట్టు రాష్ట్ర పోలీసు చీఫ్ తెలిపారు. అస్సాం విలేఖరులకు ఫోన్ చేసి ఆ రాష్ట్ర సీఎంను హెచ్చరించినట్టు వెల్లడించారు. గురుపత్వన్ సింగ్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఖలిస్తాన్ మద్దతు దారుడు గురుపత్వన్ సింగ్ విలేఖరులకు ఫోన్ చేసి..‘‘జైళ్లలో ఉన్న ఖలిస్థాన్ మద్దతుదారులను తీవ్రంగా హింసిస్తున్నారు. సీఎం గారు జాగ్రత్తగా. ఇది ఖలిస్థాన్ అనుకూలదారులకు, భారత ప్రభుత్వానికి మధ్య పోరాటం. మీరు ఈ హింసలో ఇతరులు బలైపోవద్దు. ప్రజాభిప్రాయ సేకరణ, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పంజాబ్ విముక్తిని కోరుకుంటున్నాము.
దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ అనుచరులను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు.అందుకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించినట్లు కథనాలు వెలువడ్డాయి. బెదిరింపు కాల్స్ అనంతరం .. అస్సాంలోని STF పోలీస్ స్టేషన్‌లో IPC,UAP చట్టం కింద కేసు నమోదు చేయబడింది.
