కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు.. కారుకింద ఇరుక్కుని..నరకయాతనతో ప్రాణాలు విడిచి..
కారుతో ఓ24యేళ్ల వ్యక్తిని ఈడ్చుకెళ్లిన ఘటన సూరత్ లో చోటు చేసుకుంది. 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు.

సూరత్ : గుజరాత్ లోని సూరత్ లోదారుణ ఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ ఢిల్లీలో జరిగిన అంజలి ఘటన ఇప్పటికీ మనసును మెలిపెడుతూనే ఉంది. ఆ తర్వాత అలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన సూరత్ లోనూ వెలుగు చూసింది. జనవరి 18న ఈ ఘటన జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 18 రాత్రివేళ కడోదరా- బార్డోలి రోడ్డు మీద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
నాలుగేళ్ల సాగర్ పాటిల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి టూ వీలర్ మీద వెళుతున్నాడు. అతివేగంతో వచ్చిన ఓ కారు వీరిని ఢీ కొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న భార్య కింద పడిపోయింది. సాగర్ మాత్రం కారు కింది భాగంలో చిక్కుకుపోయాడు. అయితే కారులోని వ్యక్తులు కారును ఆపకుండా అలాగే 12 కిలోమీటర్ల వరకు సాగర్ ను లాకెళ్ళారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాగర్ పాటిల్ మృతి చెందాడు. ఈ ఘటనను మొత్తం ఒకరు వీడియో తీశారు. పోలీసులకు దాన్ని చేరవేశాడు. దీంతో దీని మీద విచారణ మొదలయింది.రామచరితమానస్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జనవరి 18న బెంగళూరులో చోటు చేసుకుంది. ఢిల్లీలో నూతన సంవత్సరం రోజు జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్కూటీని ఢీ కొట్టిన కారు.. స్కూటీ మీద వెడుతున్న ఓ యువతి కారు కింద చిక్కుకోగా.. అలాగే 17 కిలోమీటర్లు ప్రయాణించి... ఆ యువతి దారుణ మరణానికి కారణం అయ్యారు. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దారుణమైన ఈ ఘటనలో యువతికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ సంఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.
ఓ యువకుడు బండి నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చాడు. ఇంకేముంది ఇంకో వాహనాన్ని ఢీకొట్టాడు. తప్పు తనదని తెలుసు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అమానుషంగా వ్యవహరించాడు. బెంగళూరులోని మాగడి రోడ్డు టోలుగేటు వద్దకు టూవీలర్ పై ఓ యువకుడు వచ్చాడు. అతడి పేరు సోహైల్ (25). వేగంగా వచ్చి ఓ జీపును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనానికి, జీపుకు డ్యామేజ్ అయింది. జీపు డ్రైవర్ ముత్తప్ప శివ శంకరప్ప (71) ఒక కుదుపుకు కంగారుపడ్డాడు. ఆ జీపు దిగి,స్థానికుల సహాయంతో యువకుడిని పట్టుకున్నారు. దెబ్బతిన్న జీపుకు రిపేర్ చేయించాలని అడిగాడు. లేదంటే రిపేరుకు అయ్యే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే, సదరు నిందితుడు మాత్రం తన టు వీలర్ కూడా దెబ్బతిన్నది అని, అయినా తను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే యువకుడు పారిపోకుండా పట్టుకునే ప్రయత్నంలో జీపు డ్రైవర్ ముత్తప్ప బైక్ ను గట్టిగా పట్టుకున్నాడు. అయితే నిందితుడు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అలాగే ముత్తపతో సహా బైక్ ను ముందుకు దూకించాడు.
బైక్ ను ఆపకుండా.. కిలోమీటర్ దూరం వరకు ముత్తప్పను అలాగే ఈడ్చుకువెళ్ళాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇది గమనించారు. వెంటనే టు వీలర్ ను ఆపి.. ముత్తపను కాపాడారు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి యువకుడిని పట్టించారు.