లక్నో:గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రయాణీస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో తప్పించుకొనే ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో దూబే మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు.కాన్పూర్ కు తీసుకెళ్తున్న సమయంలో హైవేపై వికాస్ దూబే ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో దూబే తప్పించుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఈ నెల 3వ తేదీన కాన్పూరులో జరిగిన దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. అప్పటి నుండి దూబే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ నెల 9వ తేదీన దూబేను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉజ్జయిని నుండి కాన్పూరు తీసుకొస్తున్న సమయంలో శుక్రవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన మరణించాడు.గత వారంలో ఐదుగురు వికాస్ దూబేకు చెందిన ఐదుగురు అనుచరులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు.

రహస్యాలు బయటపడకుండా యూపీ ప్రభుత్వం రక్షించబడిందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

వికాస్ దూబే అరెస్టయ్యారా, లొంగిపోయాడో చెప్పాలని అఖిలేష్ యాదవ్ నిన్న డిమాండ్ చేశారు. కాన్పూర్ ఎన్ కౌంటర్ ఘటనలో ప్రధాన నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదే నిజమైతే అతను అరెస్టయ్యాడా, లొంగిపోయాడా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.దూబే కాల్ లిస్టును ప్రజలకు బయటపెట్టాలని ఆయన కోరారు. ఈ కాల్ లిస్టును బయటపెట్టడం ద్వారా ఆయనతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో తేలుతోందన్నారు.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ శుక్రవారంనాడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రిమినల్ చనిపోయాడు. కానీ, నేరస్తులను రక్షించిన వారి పరిస్థితి ఏమిటని ఆయన ఆమె ప్రశ్నించారు.

జమ్మూ కాశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడ ఈ విషయమై ట్వీట్ చేశారు.చనిపోయిన మనుషులు కథలు చెప్పరని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రధాన అనుచరులు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే వికాస్ దూబే ఉజ్జయినిలో పోలీసులకు చిక్కాడు.