Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆ సామర్థ్యం తగ్గిపోతుందా?

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. పురుషుల్లో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. కాగా.. ఆ ప్రచారానికి కేంద్ర మంత్రి పులిస్టాప్ పెట్టారు. 
 

Can COVID-19 Vaccine Cause Infertility?": Health Minister Tackles Myths
Author
Hyderabad, First Published Jan 15, 2021, 8:27 AM IST


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. వ్యాక్సిన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు ఇప్పుడు ఫలితం దక్కింది. శనివారం నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో పలువురికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ నివృత్తి చేసే పనిలో పడ్డారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. పురుషుల్లో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. కాగా.. ఆ ప్రచారానికి కేంద్ర మంత్రి పులిస్టాప్ పెట్టారు. 

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం, పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందని ఎక్కడా నిరూపితం కాలేదని.. అవి కేవలం రూమర్స్ అని.. వాటిల్లో నిజం లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నందంతా ప్రచారమేనని.. అందులో నిజం లేదని చెప్పారు.

వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు లైట్ గా జ్వరం వస్తుందని.. దానిని చూసి కంగారు పడకూడదని ఆయన వివరించారు.  ఇదిలా ఉండగా.. జనవరి 16 (శనివారం) దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుకానుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సీటీ, ఆస్ట్రాజెన్కా ఫార్మా కంపెనీ, భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లు తయారు చేసిన వ్యాక్సిన్ ని ప్రజలకు అందజేస్తున్నట్లు చెప్పారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios