Asianet News TeluguAsianet News Telugu

మమతకు షాక్: బెంగాల్ అల్లర్లపై సీబీఐ విచారణకు కోల్‌‌కత్తా హైకోర్టు ఆదేశం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత  చోటు చేసుకొన్న హింసపై కోల్‌కత్తా హైకోర్టు గురువారం నాడు సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 

Calcutta HC orders CBI probe in alleged rape, murder cases
Author
Kolkata, First Published Aug 19, 2021, 11:38 AM IST

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న  ఎన్నికల హింసపై  సీబీఐ విచారణకు కోల్‌కత్తా హైకోర్టుతత గురువారం నాడు ఆదేశించింది.

ఇటీవలనే బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత రాఁష్ట్రంలో హింస చెలరేగింది. ప్రత్యర్థులపై టీఎంసీ శ్రేణులు దాడులకు దిగాయని విపక్షాలు ఆరోపించాయి. ప్రధానంగా తమ పార్టీ కార్యకర్తలపై టీఎంసీ దాడులు చేసిందని బీజేపీ ఆరోపించింది.

 

పలువురు బీజేపీకి చెందిన కార్యకర్తలపై టీఎంసీ శ్రేణులు అత్యాచారాలతో పాటు హత్యలు చేశారని ఆరోపణలు విన్పించాయి.  ఈ విషయమై విచారణ చేయాలని  కోరుతూ కోల్‌కత్తా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.

హత్యలు, అత్యాచారాల నేరాలకు సంబంధించిన అన్ని కేసులను సీబీఐ విచారణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర కేసుల కోసం సుమన్ బోరా సాహు, మరో ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న హింసతో  ప్రజలు  ఇళ్లను విడిచివెళ్లిపోయారని వారి ఆస్తులు ధ్వంసమయ్యాయని పిల్ దాఖలైంది. వీటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ప్రజల స్వేచ్ఛను కాపాడాలని పిటిషనర్లు కోరారు.

ఈ విషయమై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని   ఎన్‌హెచ్ఆర్‌సీ హైకోర్టు ఆదేశించింది. ఎన్‌హెచ్ఆర్‌సీ కమిటీ నివేదికను అందించింది. ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. అత్యాచారం, హత్యలలపై దర్యాప్తును సీబీఐ విచారణకు అప్పగించాలని సిఫారసు చేసింది. రాష్ట్రం వెలుపలే ఈకేసుల విచారణ చేయాలని కూడ సూచించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios