గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో 400 మందికిపైగా సందర్శకులు నదిలో పడిపోయారని సమాచారం.  వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు అంటున్నారు. మచ్చూ నదిపై దాదాపు 140 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనపై ఆదివారం పరిమితికి మించి సందర్శకులు చేరడంతో అది కుప్పకూలింది. వంతెన కూలిన సమయంలో దాదాపు 500 మంది దానిపై వుండగా.. వీరిలో 100 మంది వరకు నీటిలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో వందలాది అంబులెన్స్‌లు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Scroll to load tweet…

ఈ బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేపట్టాక.. తిరిగి ప్రారంభమైన నాలుగు రోజులకే ఈ దుర్ఘగన జరగడం గమనార్హం. మరోవైపు.. బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు అధికారులతో గుజరాత్ సీఎం ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు భూపేంద్రపటేల్.

Scroll to load tweet…