Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాల సీఎస్‌లతో కీలక భేటీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

Cabinet Secretary Rajiv Gauba Chairs High Level Meeting Of Chief Secretaries Due To corona spread ksp
Author
New Delhi, First Published Feb 27, 2021, 4:25 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

తెలంగాణలో కరోనా అదుపులోనే వుందని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. ప్రతిరోజూ 200 వందల లోపు కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు 0.43 శాతంగా వుందని సీఎస్ పేర్కొన్నారు.

ఇక తెలంగాణలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా తెలిపారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ వుండటంతో దానిపై చర్చించారు కేంద్ర కేబినెట్ సెక్రటరీ.

మరోవైపు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గడ్, తమిళనాడులలో బాధితుల సంఖ్య కలవరం పెడుతోంది. దీంతో కరోనా కొత్త రకాలు ఈ ఉద్దృతికి కారణామా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

కానీ సూపర్ స్పైడర్ ఈవెంట్లే కరోనాకు కారణమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు వైద్య నిపుణులు. రూపాంతరం చెందిన కరోనా వైరస్ వల్లే మహారాష్ట్రలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.

కోవిడ్ చైన్‌ను అడ్డుకున్న ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అటకెక్కడం కూడా కేసుల పెరుగుదలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios