Asianet News Telugu

కేంద్ర మంత్రివర్గ విస్తరణ: స్వతంత్ర భారతంలో పూర్తి వైవిధ్యం, యువకులతో నిండిన కేబినెట్

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం వుంటుందని రాష్ట్రపతి భవన్ ఇప్పటికే ధ్రువీకరించింది

Cabinet reshuffle: New Team Modi to be most diverse and youngest ever in India
Author
New Delhi, First Published Jul 7, 2021, 2:43 PM IST
 • Facebook
 • Twitter
 • Whatsapp

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం వుంటుందని రాష్ట్రపతి భవన్ ఇప్పటికే ధ్రువీకరించింది. అధికారిక సమాచారం ప్రకారం.. 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం వున్న ఏడుగురు రాష్ట్ర మంత్రులను కేబినెట్ స్థాయికి ప్రమోషన్ పొందనున్నారు. ఐదు కేబినెట్ సహా 25 మంది కొత్త మంత్రులు ఈసారి మంత్రివర్గంలో చేరబోతున్నట్లు ఏషియానెట్ ఇప్పటికే కథనాలను ప్రచురించింది. కొంతమంది సిట్టింగ్ మంత్రుల శాఖలు మారబోతున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఆయన డిప్యూటీ మోస్ సంజయ్ ధోత్రే రాజీనామా చేశారు. పోఖ్రియాల్ అనారోగ్య కారణాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అలాగే రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి రౌసాహెచ్ పాటిల్ డాన్వే, వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి దేబా శ్రీ చౌదరి కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. 

కాగా, నరేంద్రమోడీ కొత్త మంత్రి వర్గంలో ఈ సారి కొత్త, పాత, సీనియర్లు, జూనియర్ల కలయికతో వుండనుందట. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. కొత్త మంత్రుల్లో వెనుకబడిన వర్గాల నుంచి 47 మంది సభ్యులు వుండనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ తరహా కేబినెట్ ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురికి కూడా మోడీ తన టీమ్‌లో చోటు కల్పించారు. అలాగే కొత్త మంత్రివర్గంలో 11 మంది మహిళలకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈశాన్య భారతానికి చెందిన ఐదుగురికి కూడా స్థానం దక్కినట్లుగా కథనాలు వస్తున్నాయి. 

ఇకపోతే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ప్రధాని మోడీ యువతకు ప్రాధాన్యత కల్పించారు. కేబినెట్‌లో 50 ఏళ్ల లోపు మంత్రులు 14 మంది వరకు వున్నట్లు అంచనా. అలాగే కొత్త మంత్రుల్లో అంతా ఉన్నత విద్యావంతులే. వీరిలో చాలా మంది డాక్టర్లు, ఎంబీఏలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులే. గతంలో పరిపాలనా అనుభవం వున్న వారికి ప్రాధాన్యత దక్కినట్లుగా సమాచారం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో 81 మంది మంత్రులు వుండొచ్చు. ప్రస్తుతం ప్రధాని మోడీతో కలిపి కేబినెట్‌లో 53 మంది మంత్రులు వున్నారు. దీంతో మరో 28 మందిని మంత్రివర్గంలో తీసుకునేందుకు అవకాశం వుంది.

కొత్త మంత్రులుగా వినిపిస్తున్న పేర్లు:

 • జ్యోతిరాదిత్య సింధియా, రాజ్యసభ ఎంపి
 • అనుప్రియ పటేల్, మీర్జాపూర్ ఎంపి
 • రాజీవ్ చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపి
 • సర్బానంద సోన్వాల్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి
 • పశుపతి నాథ్ పరాస్, హాజీపూర్ నుండి ఎల్జెపి ఎంపీ
 • ఆర్‌సిపి సింగ్, లల్లన్ సింగ్, జనతాదళ్-యునైటెడ్ నేత
 • నారాయణ్ రాణే, మహారాష్ట్ర మాజీ సిఎం, రాజ్యసభ ఎంపి
 • తిరత్ సింగ్ రావత్, గర్హ్వాల్ ఎంపీ
 • సుశీల్ మోడీ, బీహార్ మాజీ డిప్యూటీ సిఎం, రాజ్యసభ ఎంపి
 • జమ్యాంగ్ త్సేరింగ్ నామ్‌గ్యాల్, లడఖ్‌ ఎంపి
 • జాఫర్ ఇస్లాం, బిజెపి ప్రతినిధి, రాజ్యసభ ఎంపి
 • హీనా గవిత్, నందూర్‌బార్‌ ఎంపి
 • లాకెట్ ఛటర్జీ, హుగ్లీ ఎంపీ
 • దిలీప్ ఘోష్, మేదినీపూర్ ఎంపీ
 • మీనాక్షి లేకి, ఎంపీ, న్యూఢిల్లీ
 • మనోజ్ తివారీ, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ 
   
Follow Us:
Download App:
 • android
 • ios