కర్ణాటక: కర్ణాటక రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు మార్గం రూట్ క్లియర్ అయ్యింది. బీజేపీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి వర్గ విస్తరణకు తేదీ ఖరారు చేశారు కర్ణాటక సీఎం యడియూరప్ప. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పనిలోపడ్డారు సీఎం యడియూరప్ప.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షా మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలపడంతో ఈ నెల 20న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడు వారాల తర్వాత కేబినెట్‌ విస్తరించనున్నారు.

ఈనెల 20న కర్ణాటక బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరగబోతుందని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ ఉంటుందని యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు. 

ఇకపోతే జూలై 26న సీఎంగా ప్రమాణ స్వీకారం యడియూరప్ప.అంతేకాదు అప్పటి వరకు ఉన్న యడ్యూరప్ప పేరును యడియూరప్పగా కూడా మార్చేసుకున్నారు. అనంతరం ఈనెల 20న అంటే మూడువారాల అనంతరం కేబినెట్ విస్తరణ చేయబోతున్నారు.