Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ:వీరికే ఛాన్స్ ?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఈ నెల 7వ తేదీన చేపట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు మోడీ కేబినెట్ విస్తరణకు ముహుర్తంగా నిర్ణయించుకొన్నారని సమాచారం.

Cabinet expansion buzz: PM Modi holds multiple meetings over weekend with Amit Shah, BL Santosh lns
Author
New Delhi, First Published Jul 5, 2021, 7:14 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఈ నెల 7వ తేదీన చేపట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు మోడీ కేబినెట్ విస్తరణకు ముహుర్తంగా నిర్ణయించుకొన్నారని సమాచారం.2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. 

కేబినెట్ విస్తర‌ణ‌పై గత రెండు రోజులుగా ప్రధానితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. కేబినెట్ విస్తర‌ణ‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు  చోటు దక్కే అవకాశం ఉంది.

ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్, అసోం మాజీ ముఖ్యమంత్రి శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణే, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలకు కేబినెట్‌ బెర్తు  ఖాయమైందని ప్రచారం సాగుతోంది.

మ‌ధ్యప్రదేశ్ నుంచి జోతిరాధిత్య సింధియా, జ‌బ‌ల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్‌.. బీహార్‌ ఎల్జేపీ నేత ప‌శుప‌తి కుమార్ ప‌రాస్‌, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌  ఉత్తర్‌ప్రదేశ్‌ అప్నాద‌ళ్ అధినేత అనుప్రియా ప‌టేల్, వ‌రుణ్‌గాంధీ, రాంశంక‌ర్ క‌థేరియా, అనిల్ జైన్‌, రీటా బ‌హుగుణ జోషి, జాఫ‌ర్ ఇస్లాం మ‌హారాష్ట్ర నుంచి బీజేపీ ఎంపీ హీనా గావిట్‌, భూపేంద్ర యాద‌వ్‌, పూనం మ‌హాజ‌న్‌, ప్రీతం ముండే.. ల‌డ‌ఖ్ ఎంపీ జామ్యాంగ్ నాంగ్యాల్‌ ఉత్తరాఖండ్‌ నుంచి అజ‌య్ భ‌ట్, అనిల్ బాలూనీ కర్ణాటక నుంచి ప్రతాప్ సిన్హా ప‌శ్చిమ బెంగాల్‌ నుంచి జ‌గ‌న్నాథ్ స‌ర్కార్ హర్యానా నుంచి బ్రిజేంద్ర సింగ్ పేర్లు దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios