న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకొంది. సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్  కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.సివిల్స్ సర్వీసెస్ అధికారులు దేశ భవిష్యత్తు కోసం మరింత సృజనీలురుగా నిర్మాణాత్మకంగా చురుకుగా పారదర్శకంంగా ఉండేలా దేశ భవిష్యత్తు కోసం వారిని తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది.

ఇందు కోసం మిషన్ కర్మయోగిని ప్రారంభించనుంది. భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపర్చనున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టనుంది. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిందీ, కాశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్ భాషలను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కూడ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇది ప్రభుత్వంలో అతి పెద్ద మానవ వనరుల అభివృద్ధి సంస్కరణ అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి అధ్యక్షతన హెచ్ఆర్ కౌన్సిల్ ఉంటుంది. ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటారు.  ప్రసిద్ద విద్యావేత్తలు, ప్రపంచ నాయకులు పౌరసేవలకు నాయకత్వం వహించిన  ప్రముఖుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకొంటారు.