పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన తర్వాత కేంద్రం సీఏఏను అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి చెప్పారు. 

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన తర్వాత కేంద్రం సీఏఏను అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి చెప్పారు. ఈ రోజు పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్ షా కార్యాలయంలో ఆయనతో సువేందు అధికారి భేటీ అయ్యారు. బెంగాల్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటుగా, ఇతర అంశాలు.. వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఈ సమయంలో సీఏఏ అమలుపై సువేందు అధికారి వద్ద సీఏఏపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను పంపిణీకి సంబంధించి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ముగిసిన తర్వాత CAA అమలు చేయబడుతుందని హోం మంత్రి తనకు హామీ ఇచ్చారని సమావేశం అనంతరం సువేందు అధికారి తెలిపారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు చేసింది. 

ఇక, పౌరసత్వ సవరణ చట్టం.. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టం. 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అయితే దీనిని వివిధ వర్గాలు వ్యతిరేకించాయి. కేంద్రం ఇందుకు సంబంధించి నిబంధనలను రూపొందించకపోయినప్పటికీ.. అమిత్ షా మాత్రమే సీఏఏను అమలు చేస్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూనే ఉన్నారు.