మంగళూరు: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దానికి మతపరమైన రంగును కూడా పులిమి రెండు మతాల మధ్య ఇది పోరుగా....  వారి మధ్య చిచ్చు పెట్టేంతలా కూడా ఈ నిరసనలు, మద్దతులు తయారయ్యాయి. ఢిల్లీలో  మనకు ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 

తాజాగా గతంలో ఒక మౌల్వి భారతీయ ముస్లింలను ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టొద్దని కోరారు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది. ఆ మౌల్వి చేసిన ప్రసంగాన్ని కొన్ని మీడియా చానెళ్లు తీవ్రంగా ఖండిస్తూ ఆయనను ఆరెస్సెస్ ఏజెంట్ గా, కేంద్ర ప్రభుత్వ మనిషిగా అభివర్ణించడంతోపాటుగా ఆయనను చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దానితో ఇప్పుడు మరోమారు ఈ వ్యవహారం వైరల్ గా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కాసర్గోడ్, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు ప్రాంతాల్లో ముస్లింల మతపెద్దగా... ఆ వర్గాల్లో బాగా ప్రాబల్యం ఉన్న మాత ప్రవక్త ఖాజీ త్వఖ అహ్మద్ ముస్లింలను శాంతియుతంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళలో చేపట్టిన నిరసనల మాదిరి కర్ణాటకలో చేపట్టొద్దని కోరారు ఆయన. 

దానితోపాటు ఆయన శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంకలతో కూడిన అఖండ భారత్ ను నెలకొల్పాలని కూడా కోరారు. వాస్తవానికి ఆయన బయట దేశాల నుండి వచ్చినవారిని వారి వారి దేశాలకు పంపించివేయాలని కోరారు.. అందుకోసం ఆయన బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొందము శాంతికి ఎలా విఘాతం కలిగిస్తున్నారో ఉదహరించారు. 

ఓవర్ అల్ గా ఆయన ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులకు శుభం కార్డు వేసి.... ప్రజలంతా సంయమనం పాటించి శాంతి కోసం కృషి చేయాలనీ ఆయన కోరారు. శాంతియుత వాతావరణాన్ని ఆకాంక్షించడం అవునన్నా కాదన్నా ఈ పరిస్థితుల్లో అత్యవసరం. 

కాకపోతే ఈ ఖాజిని ఆరెస్సెస్ ఏజెంటు గ అభివర్ణిస్తూ... వార్తలను ఒక మలయాళం ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వార్త ప్రసారం అయినా తరువాత నుంచి ఆయనకు బెదిరింపు రావడం మొదలయ్యాయి. ఎస్డీపీఐ వంటి సంస్థలకు చెందినవారమని చెప్పుకుంటూ ఈయనను పలుమార్లు చంపుతామని బెదిరించారు. 

దీనితో ఆ సదరు ఖాజీ మంగళూరు పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ దాఖలు చేసారు. ఐజీ ని కలిసి తన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. దీనితోపాటుగా ఖాజీ కొడుకు హుస్సేన్... ఇలా ఖాజిని ఆరెస్సెస్ కు చెందిన వ్యక్తిగా చూపెడుతూ వార్తను ప్రసారం చేసిన ఎస్ న్యూస్ విజన్ ఛానెల్ పై కూడా కేసు దాఖలు చేసారు. 

ఇలా శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేసినందుకు ఈ సదరు మౌల్విని పోలీసుల బూట్లు నాకే కుక్కలుగా అభివర్ణించింది ఆ సదరు న్యూస్ ఛానల్. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేసేవారికి రక్షణ లేకుండా పోతుందని వారు వాపోతున్నారు.