Asianet News TeluguAsianet News Telugu

C Voter Survey: బీహార్ రాజకీయాలపై C Voter సర్వే.. తేజస్వికి పెరుగుతున్న‌ఆదరణ.. ఎన్డీయేకు ఓటమి త‌ప్ప‌దా!?

C Voter Survey: యువతలో తేజస్వి యాదవ్‌కు ఎక్కువ ఆదరణ ఉందని, ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనిC Voter Survey లో తేలింది.

C voter survey shows Bihar prefers Tejashwi as CM
Author
Hyderabad, First Published Aug 11, 2022, 12:33 AM IST

C Voter Survey: బీహార్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగం మారాయి. సీఎం నితీష్‌ కుమార్ ఆడిన రాజకీయ క్రీడలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న‌ బీజేపీతో తెగ‌దింపులు చేసుకుని.. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని RJD తో జత‌ క‌ట్టాడు. మరోసారి మహాకూటమితో కలిసి ఎన్డీయేను అధికారం నుంచి దించారు. దీంతో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే ప్ర‌స్తుత‌ రాజకీయ తిరుగుబాటు వల్ల ఎవరు లాభపడ్డారు అనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఈ నేప‌థ్యంలో C-VOTER ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ వైదొలగడం ఎంత‌వ‌ర‌కూ సరైంది? ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేనా? తేజశ్వి, నితీష్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మేంటీ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నింటితో C-VOTER  ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ముఖ్యమంత్రి ఎంపిక నుంచి ప్రస్తుత పరిస్థితిలో లాభనష్టాల వరకు ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు.

తేజశ్వికి పెరిగిన‌ పాపులారిటీ

బీహార్ త‌రువాత‌ ముఖ్యమంత్రి ఎవరనేది సర్వేలో కీల‌క ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా.. 43 శాతం మంది ప్రజలు తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి చేయాల‌ని భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో  24 శాతం మంది మాత్రమే నితీష్‌ను ముఖ్యమంత్రి కావాల‌ని, 19 శాతం మంది మాత్ర‌మే బీజేపీకి చెందిన అభ్య‌ర్థిని ముఖ్యమంత్రి చేయాల‌ని భావిస్తున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంతో కంటే..  తేజస్వియాద‌వ్ కి రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగిందని, ముఖ్యంగా యువ‌త  ఆయ‌న‌కు ఎక్కువ ఆద‌రిస్తుంద‌ని సి ఓటర్ డేటా చూపిస్తోంది. తేజశ్వికి పాపులారిటీపెరిగితే.. సీఎం నితీష్ కుమార్ కు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..

మహిళా ఓటర్లలో మొదటి ఎంపిక ఎవరు?

ఈ రేసులోనూ తేజస్వి ముందంజలో ఉన్నారు. మ‌హిళా ఓట‌ర్లలో కూడా ఆయ‌న‌కు మంచి పాపులారిటీ ఉంది. సర్వేలో పురుషుల అభిప్రాయం తీసుకోగా.. అక్కడ కూడా నితీష్ పంచ్ ప‌డింది.  41.8 శాతం మంది పురుషులు తేజస్విని సీఎం పదవికి తమ మొదటి ఎంపికగా భావిస్తుండగా..  కేవలం 23.8 శాతం ఓట‌ర్లు మాత్ర‌మే నితీష్ సీఎం కావాల‌ని భావిస్తున్నారు. బిజెపి ఈ విష‌యంలో కూడా చాలా వెనుకబడింది.  కేవలం 19.6 శాతం మంది పురుషుల మద్దతు ద‌క్కింది. 

ఇక మహిళ ఓట‌ర్ల‌ గురించి మాట్లాడిన నితీష్ ఇక్కడ కూడా నిరాశ ఎదురైంది. 2020 ఎన్నిక‌ల‌లో  తేజస్వి సీఎం కావాల‌ని  మొగ్గు చూపుతున్నారు. సర్వే ప్రకారం.. 44 శాతం మంది మహిళలు తేజస్విని ముఖ్యమంత్రి మొదటి ఎంపికగా ఎన్నుకోగా..  . అదే సమయంలో 23.3 శాతం మంది మహిళలు మాత్రమే నితీష్‌ను ఇష్టపడుతున్నారు. బీజేపీ అభ్య‌ర్థికి కేవలం 17.5 శాతం ఓట్లు వ‌చ్చాయి.
 
ముస్లిం సమాజం ఎటు చూస్తోంది ? 

కులాల వారీగా పాపులారిటీ చీలిపోతే..  ఇక్కడ కూడా నితీష్ కుమార్ కంటే తేజశ్వి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. OBC కేటగిరీలో ముఖ్యమంత్రి గురించి ప్రశ్నలు అడగగా..  44.6 శాతం మంది ప్రజలు తేజస్వి యాదవ్ ను సీఎం చేయాల‌ని భావిస్తుండ‌గా..  నితీష్‌ను 24.7 శాతం మంది మాత్రమే ఇష్టపడుతుండ‌గా.. బీజేపీ అభ్య‌ర్థి సీఎం కావాల‌ని 18.4 శాతం మంది మాత్ర‌మే ఇష్ట‌ప‌డుతున్నారు.

ఇక ముస్లిం సమాజం విషయానికి వస్తే... బహిరంగంగానే తేజస్వికి అనుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. సి ఓటర్ స‌ర్వే ప్రకారం..  ప్రస్తుతం 54 శాతం మంది ముస్లింలు తేజస్విని త‌రువాత సిఎంగా  పరిగణిస్తున్నారు, కేవ‌లం 30 శాతం ముస్లింలు మాత్రమే నితీష్‌ను ఇష్టపడుతున్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఎన్నికలు జరిగితే ఎవ‌రికి ఎన్ని...

తేజస్వి యాద‌వ్ కు యువ‌త‌లో భారీ పాపుల‌రిటీ ఉండ‌టంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను కైవ‌సం చేసుకోబోతుంద‌నే ఆసక్తికర లెక్కలు బయటకు వస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ ఎన్‌డీఏకు అనుకూలంగా ఓటు వేసింది. అప్పుడు.. ఎన్డీయేకు 54 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఆగస్టు 2022 నాటికి ఈ సంఖ్య 41 శాతానికి తగ్గింది. అంటే మూడేళ్లలో ఎన్డీయే 13 శాతం నష్టాన్ని చవిచూసింది. 

మరోవైపు ఎన్డీయేకు జరుగుతున్న నష్టాన్ని మహాకూటమి ప్రత్యక్షంగా ఉపయోగించుకుంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమికి 31 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో సమీకరణాలు మారడంతో మహాఘటబంధన్ కూడా లాభపడేలా కనిపిస్తోంది. ఈ సమయంలో తేజ‌స్వీ యాద‌వ్ కు 46 శాతం ఓట్లు వచ్చాయి.. అంటే.. ఏకంగా 16 శాతం జంప్ అయ్యింది.  సీట్ల ప్రాతిపదికన  ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. ఎన్డీయే సంఖ్య 14కి తగ్గవచ్చు. 2019లో క్లీన్‌స్వీప్‌లో 39 సీట్లు గెలుచుకున్న పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios