By-elections: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు 3 నవంబర్ 2022న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీహార్‌లో 2, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశాలో ఒక్కో సీట్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం బీజేపీ మూడు చోట్ల విజ‌యం సాధించింది.  

By-elections Result: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు 3 నవంబర్ 2022న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీహార్‌లో 2, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశాలో ఒక్కో సీట్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం బీజేపీ మూడు చోట్ల విజ‌యం సాధించింది. అయితే, ఫ‌లితాలు ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. బీజేపీ అభ్య‌ర్థులు గెలుపు ఖాయం చేసుకున్న స్థానాలు బీహార్ లోని గోపాల్‌గంజ్, హ‌ర్యానాలోని అదంపూర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గోలా గోకర్నాథ్ స్థానాలు ఉన్నాయి.

Scroll to load tweet…

హర్యానాలోనూ బీజేపీదే విజయం

హర్యానాలోని అదంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ దాదాపు 16 వేల ఓట్లతో గెలుపొందారు. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. బీజేపీ వరుసగా మూడో స్థానంలో విజయం సాధించింది. హర్యానాలోని అదంపూర్ నియోజకవర్గంలో 75.25 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ కుమారుడు కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆగస్టులో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బిష్ణోయ్ కుమారుడు భవ్య పోటీకి దిగారు. బీజేపీ అభ్య‌ర్థికి 67492 ఓట్లు వ‌చ్చాయి. 

గోపాల్‌గంజ్‌ నుంచి బీజేపీ విజయం సాధించింది

గోపాల్‌గంజ్‌లో బీజేపీ విజయం సాధించింది. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. బీహార్ లో మొత్తం రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో గోపాల్ గంజ్, మొకామాలు ఉన్నాయి. బీహార్ ఆర్జేడీ ఒక స్థానంలో, మరో స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. గోపాల్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించారు. గోపాల్‌గంజ్ ఉప ఎన్నికలో మోహన్ ప్రసాద్ గుప్తాను ఆర్జేడీ రంగంలోకి దించగా, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ భార్య కుసుమ్ దేవికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో 48.35 శాతం ఓటింగ్ నమోదైంది. గోపాల్ గంజ్ లో బీజేపీ అభ్య‌ర్థికి 70053 ఓట్లు వ‌చ్చాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో నూ.. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గోల గోకర్నాథ్ విధానసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అమన్ గిరి విజయం సాధించారు. ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఎస్పీ అభ్యర్థిపై అమన్ గిరి సుమారు 38 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థి అమ‌న్ గిరికి 124810 ఓట్లు వ‌చ్చాయి. ఎస్పీ అభ్య‌ర్థికి 90512 ఓట్లు వ‌చ్చాయి.