చెన్నై: పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంటే దాన్ని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు చెన్నైలోని ఓ బేకరీ సంస్థ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఒక కిలో కేక్‌ కొంటే లీటరు పెట్రోలు ఫ్రీ అంటూ ఆ బేకరీ ఆఫర్ ప్రకటించింది. 

తమిళనాడుకు చెందిన డీసీ బేకరీ ఈ ఆఫర్ ను ప్రకటించింది. పెట్రోల్ రేట్ అనేది ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో దాన్ని దాన్ని క్యాష్ చేసుకుని తమ బేకరీని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.  ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితం అని ప్రకటించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు ఓ యువకుడు. తాజాగా బేకరీ ఆఫర్ ప్రకటించడంతో హాట్ టాపిక్ గా మారింది. 

ఇకపోతే దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం కూడా ఒకటి. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీలో రూ. 82.32 ఉండగా ముంబై లో 89.92 రూపాయలు ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

దంపతులకు పెళ్లి కానుక.. పెట్రోల్ క్యాన్