ఓ ఇసుక, క్రషర్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తిని నలుగురు అగంతులకు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ చంపారన్ జిల్లా నాకా డెర్మా గ్రామానికి చెందిన యోగేంద్ర కుమార్ ఇసుక, క్రషర్ వ్యాపారం చేసేవాడు.

యోగేంద్ర కుమార్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర కుమార్ ను అతనితో పాటు వచ్చిన కుటుంబసభ్యులు శ్రీకృష్ణ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అప్పటికే యోగేంద్ర మరణించాడని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సంఘటన స్థలంలో పోలీసులకు నాలుగు ఖాళీ తూటాలు లభించాయి. యోగేంద్రను కాల్చిచంపి పారిపోయిన నలుగురు ఆగంతకుల కోసం తాము ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నామని ఏఎస్ఐ రాంనరేష్ సిన్హా చెప్పారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.