చెన్నైలోని కన్యాకుమారి జిల్లా మార్తాండంలో ఓ వ్యాపారవేత్త భార్య బుధవారం 150 సవర్ల నగలు తీసుకునిప్రియుడితో పారిపోయింది. మార్తాండానికి చెందిన వ్యాపారి (50) ఒకతను ఆ ప్రాంతంలో ఫైనాన్స్‌ సంస్థ నడుపుతున్నాడు. 

చెన్నై: చెన్నైలోని కన్యాకుమారి జిల్లా మార్తాండంలో ఓ వ్యాపారవేత్త భార్య బుధవారం 150 సవర్ల నగలు తీసుకునిప్రియుడితో పారిపోయింది. మార్తాండానికి చెందిన వ్యాపారి (50) ఒకతను ఆ ప్రాంతంలో ఫైనాన్స్‌ సంస్థ నడుపుతున్నాడు. 

ఆయనకు భార్య (40), ముగ్గురు కూతుళ్ల, కుమారుడు ఉన్నారు. వీరి ఇంటి సమీపంలో రాజకీయ ప్రముఖుడు (37) కొయ్యల వర్క్‌షాపు నడుపుతున్నాడు. అతనికి వివాహం జరిగి భార్య, పిల్లలు ఉన్నారు. వ్యాపారికి, రాజకీయ ప్రముఖుడి వద్ద వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయి.

దాంతో రాజకీయ ప్రముఖుడు తరచూ వ్యాపారికి వస్తూపోతుండేవాడు. ఆ క్రమంలో వ్యాపారి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వ్యాపారి వారిని మందలించాడు. దీంతో వ్యాపారి భార్య తమ ఇంట్లో ఉన్న 150 సవర్ల నగలు, నగదుతో అదృశ్యమైంది. 

ఆమె ప్రియుడితో కలిసి పారిపోయినట్లు విచారణలో తెలిసింది. దీనిఫై ఫిర్యాదు అందుకున్న మార్తాండం పోలీసులు పరారీలో ఉన్న ప్రేయసీప్రియుల కోసం గాలిస్తున్నారు.