కొడుకు ప్రేమలో పడ్డాడని తెలిసి ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా పెళ్లికి అంగీకరిస్తే తన తండ్రి లాంటి వ్యక్తి ఉండరని ఆ కుమారుడు ఎంతో పొంగిపోయాడు. ఈ క్రమంలో ఆయనలోని మృగాడు కాబోయే కోడలి జీవితాన్ని నాశనం చేశాడు.

Also Read:నిర్భయ కేసు: పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం నాగపట్నానికి చెందిన నిత్యానందం స్థానికంగా ఓ బట్టల షాపు నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని కుమారుడు ముకేశ్ కన్నన్ తాను ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని నిత్యానందం వీరిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని భావించాడు. దీంతో ఏ తండ్రి ఒడిగట్టనంత నీచానికి పథకం వేశాడు. పెళ్లి గురించి మాట్లాడుకుందామంటూ నిత్యానందం.. కుమారుడి ప్రేయసీకి కబురు పెట్టాడు.

ఇది నిజమేనని నమ్మిన ఆమె ముకేష్ ఇంటికి వెళ్లింది. అలా వచ్చిందో లేదో నిత్యానందం ఆమె చేతిలో ఫోన్ లాక్కొని.. ‘‘నీకు నా కొడుకుతో పెళ్లి కావాలా’’ అంటూ మెడ చుట్టూ తాళిబొట్టు బిగించి అత్యాచారానికి యత్నించాడు.

Also Read:చెన్నైలో మహిళకు కరోనా వైరస్ లక్షణాలు

అక్కడితో ఆగకుండా ఆమెను రెండు రోజుల పాటు ఇంట్లో బంధించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఇంట్లో బంధించాడు. అసలు విషయం తెలుసుకున్న ముఖేశ్ తన ప్రేయసిని కాపాడుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.