ఉత్తరప్రదేశ్ లో నది మధ్యలో ఇరుక్కున్న బస్సు.. 25 మంది ప్రయాణికులు..
25మంది ప్రయాణికులతో వెడుతున్న ఓ బస్సు నది మధ్యలో చిక్కుకుపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ లోని కోటవాలి నది బ్రిడ్జి మీదినుంచి ప్రవహిస్తోంది. అటుగా వచ్చిన బస్సు ప్రవాహ ఉదృతి తెలియక బ్రిడ్జి మీదికి వచ్చేసరికి.. నది మధ్యలో ఇరుక్కుపోయింది. బిజ్నోర్ లోని మండవాలి ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులున్నారు.
ఏం జరిగిందో తెలుసుకునేలోపే బస్సు ప్రమాదంలో పడిపోయింది. వెంటనే సమాచారం అందించడంతో అక్కడికి రెస్క్యూ బృందం చేరుకుంది. క్రేన్ల సహాయంతో బస్సు బోల్తా పడకుండా ఆపి.. ప్రయాణికులను పైకి తీసుకువస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.