లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 30 మంది దాకా గాయపడ్డారు. 

ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న బస్సు ట్రాక్టర్ ట్రోలీని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ప్రమాదం సంభవించింది. బంగార్మావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవఖరి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 

గాయపడినవారిని చికిత్స నిమిత్తం లక్నో ట్రోమా సెంటర్ కు తరలించారు.