తమిళనాడులో లారీని ఢీ కొట్టిన బస్సు.. మంటల్లో పూర్తిగా దగ్థం..12మందికి గాయాలు..
అతివేగంతో దూసుకువచ్చిన ఓ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో చెలరేగిన మంటల్లో పూర్తిగా దగ్థమయ్యింది.

తమిళనాడు : తమిళనాడులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు అతివేగంతో దూసుకొచ్చి లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్థం అయిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. 12మంది గాయాలతో బయటపడ్డారు.
తమిళనాడులోని తిరువెక్కాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మధురైనుంచి వస్తున్న లారీని కర్నాటకకు చెంది బస్సు ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు దిగి పరిగెత్తారు. ప్రాణాలు దక్కించుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.