మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, ఆటో బావిలో పడి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా నాసిక్ జిల్లా డియోలా ప్రాంతం వద్ద ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Also Read:పాకిస్తాన్‌ను ఓడించేందుకు పది రోజులు చాలు: మోడీ సంచలనం

అనంతపురం అదుపుతప్పి రెండూ పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బావి సుమారు 70 అడుగుల లోతు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read:నాపై జైలులో లైంగిక దాడి: నిర్భయ దోషి ముఖేష్ సంచలనం

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తాళ్ల సాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు కింది భాగంలో ఆటో ఇరుక్కుని ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ క్రేన్ సాయంతో బస్సు, ఆటోను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.