Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు, నలుగురు మృతి..

సోమవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ఓవర్‌బ్రిడ్జి మీదినుంచి వెడుతున్న బస్సు అదుపుతప్పిదౌసాలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

Bus falls on railway track in Rajasthan, 4 killed - bsb
Author
First Published Nov 6, 2023, 8:48 AM IST

రాజస్థాన్‌ : రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పపడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ బస్సు 30 మందికి పైగా ప్రయాణికులతో హరిద్వార్ నుంచి ఉదయపూర్ వెడుతోంది.

"ప్రమాదం తరువాత, 28 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు, వారిలో నలుగురు మరణించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. సంఘటనను పరిశోధించడానికి ఎస్ డీఎంను సంఘటనా స్థలానికి పంపారు" అని దౌసాలోని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ కస్వా తెలిపారు.

దౌసా కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2:15 గంటలకు ఓవర్‌బ్రిడ్జి నుండి దౌసాలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios