జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం నాడు ఐటీబీపీ జవాన్లు ప్రయాణీస్తున్న బస్సు లోయలో పడింది.ఈ సమయంలో బస్సులో 37 మంది జవాన్లున్నారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 37 మంది ఐటీబీపీ జవాన్లు ఉన్నారు. అమర్‌నాథ్ యాత్రికుల విధుల నుండి తిరిగి వస్తున్న సమయంలో బస్సు చందన్వారి నుండి శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్తోంది. సహాయక చర్యలు చేపట్టినట్టుగా అధికారులు ప్రకటించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో ఆరుగురు మరణించారని సమాచారం. మరో వైపు ఈ ఘటనలో గాయపడిన ఐటీబీపీ జవాన్లను హెలికాప్టర్ల సహాయంతో సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ బస్సులో ఐటీబీపీతో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు చెబుతున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.