జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రజౌరీ జిల్లా దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ్‌కోట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శనివారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందోనని అక్కడికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.