Road accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సు, ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Road accident: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సు, ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. నాగర్ కోయిల్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగీత బృందానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సు, ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు చెన్నై వైపు వెళ్తోంది.
పాతరకుడి దాటుతుండగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టే పరిస్థితుల నుంచి తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. 44 మందిలో 26 మంది గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను చిదంబరం, పద్మనాభన్, అరుళ్రాజ్, బాలమురుగన్ గా గర్తించారు. తీవ్రంగా గాయపడిన 8 మంది ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం చిదంబరం ఆసుపత్రికి తరలించారు.
కర్నాటక ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో గురువారం రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. కుముద్వతి నది వంతెన సమీపంలో జాతీయ రహదారి (ఎన్ హెచ్) 206పై రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మృతులు, క్షతగాత్రులను గుర్తించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వారి కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందించినట్టు పోలీసులు పేర్కొన్నారు. శికారిపూర్ నుంచి చోరాడి మీదుగా శివమొగ్గ వెళ్తున్న వెంకటమహాలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ కు చెందిన బస్సు శివమొగ్గ నుంచి సాగర వైపు వెళ్తున్న శ్రీనివాస ట్రాన్స్ పోర్ట్ కు చెందిన మరో ప్రయివేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం శివమొగ్గ నగరంలోని ఎంసీ గన్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
