బీజాపూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో  పోలీసులు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకొన్నారు. కూంబింగ్ నుండి తిరిగి వస్తున్న జవాన్ల బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 30 మంది జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించిన డీఆర్‌జీ జవాన్లు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మల్కన్‌గిరి బీజాపూర్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అయితే ఈ వరద నీటిలోనే  జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లింది.  అయితే వరద నీటిలో బస్సు కొట్టుకుపోయింది. వరదనీటిలో బస్సు కొట్టుకుపోతున్న విషయాన్ని గ్రహించిన  జవాన్లు బస్సు దిగి వరద నీటి నుండి బయటకు వచ్చారు. 

బస్సులోని 30 మంది జవాన్లు ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారని  అధికారులు తెలిపారు.మావోయిస్టుల కోసం జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా కూంబింగ్ ను నిలిపివేసి తమ హెడ్ క్వార్టర్ కు బయలుదేరారు. ఈ సమయంలో వరద నీటిని అంచనా వేయడంలో పొరపాటు చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.