బుర్ఖా వేసుకుని మద్యం కొనడానికి వచ్చిందని మహిళను వేధింపులకు గురి చేశారు. తల తీసేస్తామంటూ హెచ్చరించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. 

ఆగ్రా : బురఖా ధరించిన మహిళను "తల నరికివేస్తానని" బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇప్పటికే నేర చరిత్ర కలిగిన ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులను సోమవారం యుపిలోని ముజఫర్‌నగర్‌లో అరెస్టు చేశారు.

30 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళ, మద్యం షాపులో మద్యం కొనడానికి వెళ్లింది. ఆమెను బాకు అలియాస్ షహనవాజ్ (40), అదిల్ అహ్మద్ (30), అతని సోదరుడు సాజిద్ అహ్మద్ (35), అడ్డుకున్నారు. 

వీరంతా అదే ప్రాంతానికి చెందినవారు. ఆమె మళ్లీ అలా చేయడానికి ప్రయత్నిస్తే, "పరిణామాలు" తీవ్రంగా ఉంటాయని వారు ఆమెను హెచ్చరించారు. దీన్నంతా దారిన వెడుతున్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఈ రెండు నిమిషాల క్లిప్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు.

పక్కింటి వ్యక్తిని చంపి, మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి.. అతని ఇంట్లో దాచిపెట్టిన ఫుడ్ డెలివరీ ఏజెంట్..

వీడియోలో, వారిలో ఒకరు బెదిరింపు స్వరంతో మాట్లాడుతూ, “మద్యం కొనడానికి ఇక్కడికెందుకు వచ్చావు. నా గురించి నీకు తెలియదు. నేను ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాను. ఇప్పటికిప్పుడే నీ తల నరికేస్తాను’’ అంటూ మహిళను హెచ్చరించాడు. ఆ తరువాత ఆమెను విడిచి పెట్టారు. 

ఈ విషయం గురించి ముజఫర్‌నగర్‌ డీఎస్పీ విక్రమ్‌ ఆయుష్‌ మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై అవగాహన కల్పించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారిని త్వరలో మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తామని తెలిపారు.

నగర్ కొత్వాలి ఎస్‌హెచ్‌ఓ మహావీర్ సింగ్, "శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మహిళను బెదిరించినందుకు ముగ్గురిపై కేసులు నమోదు చేయబడ్డాయి. ఇద్దరు సోదరులపై స్థానికంగా గతంలో నేర కార్యకలాపాలకు సంబంధించి ఇతర కేసులు కూడా ఉన్నాయి. దీనిమీద మహిళ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు" అని తెలిపారు.