Manipur Violence: మణిపూర్ లోని ఖమెన్ లోక్ ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతం కాంగ్‌పోక్పి-ఇంఫాల్ మధ్య సరిహద్దులో ఉంది. దాదాపు తొమ్మిది మంది చనిపోయారనీ, మరో 10 మంది గాయ‌ప‌డ్డార‌ని స్థానిక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంఖ్యను అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. 

Manipur continues to burn: మ‌ణిపూర్ లో మ‌ళ్లీ సింసాత్మ‌క ఉద్రిక్త నెల‌కొంది. తాజా హింస‌లో తొమ్మిది మంది చ‌నిపోగా, మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని స్థానిక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ప్రభావిత ప్రాంతం కాంగ్‌పోక్పి-ఇంఫాల్ మధ్య సరిహద్దులో ఉంది. అయితే ఈ మ‌ర‌ణాల సంఖ్యను అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.

వివ‌రాల్లోకెళ్తే.. ఇంఫాల్ తూర్పు-కాంగ్‌పోక్పి జిల్లాల సరిహద్దులోని అగిజాంగ్ గ్రామంలో మంగళవారం రాత్రి 10 నుంచి 10:10 గంటల మధ్య సాయుధ దుండగుల బృందంతో చెలరేగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా, 10 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో హింస‌ను పెంచుతున్న‌ దుండగులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి 10-10:30 గంటల సమయంలో గ్రామంలో కాల్పులు జరిగాయనీ, తొమ్మిది మంది చనిపోయారని, 10 మంది గాయపడ్డారని స్థానిక వ‌ర్గాలు తెలిపాయి. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించామని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఇంఫాల్ ఈస్ట్ పోలీసు సూపరింటెండెంట్ కె.శివకాంత సింగ్ తెలిపినట్టు హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది.

తాజా హింస చెల‌రేగిన‌ ప్రాంతం భద్రత బాధ్యతలను అస్సాం రైఫిల్స్ చూసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని సింగ్ తెలిపారు. కాగా, కొండ జిల్లాలలో ఎక్కువగా నివసించే గిరిజన కుకీలు, ఇంఫాల్ లోయలోని ఆధిపత్య కమ్యూనిటీ అయిన మైతీ (మెయిటీస్) వ‌ర్గాల‌ మధ్య మే 3న చెలరేగిన హింస నుండి కనీసం 115 మంది మరణించారు. మరో 40,000 మంది నిరాశ్రయులయ్యారు. మైతీల‌కు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలన్న కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలో ఈ హింస చెలరేగింది. హింస రాష్ట్రం మొత్తం వ్యాపించి.. ఆందోళ‌నక‌రమైన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టానికి కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ ను నిలిపివేశారు. ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు భద్రతా బలగాలను రాష్ట్రానికి తరలించినప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతూ కొన‌సాగాయి.

రాష్ట్రంలో శాంతికి మధ్యవర్తిత్వం వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో భాగం కావడానికి పోరాడుతున్న మైతీ, కుకీ వర్గాలకు చెందిన ప్రముఖ పౌర సంఘాలు సోమవారం నిరాకరించాయి. ఉద్రిక్తతలను తగ్గించే చర్యల్లో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 1న ప్రకటించారు. దీనికి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అధ్య‌క్షులుగా ఉన్నారు. తాజా హింస నేప‌థ్యంలో కర్ఫ్యూ స‌మ‌యాల‌ను అధికారులు మార్చారు. కొత్త కర్ఫ్యూ సమయం ఉదయం 5 నుండి ఉదయం 9 వరకు ఉంటుంద‌నీ, ఇది ఇంఫాల్, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలకు వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.