కాలువలో కరెన్సీ కట్టలు.. అన్నీ 100, 200, 500నోట్లే.. 

నీటి కాలువలో  కరెన్సీ కట్టలు కొట్టుకవచ్చిన ఘటన బీహార్‌లోని ససారం మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడి కాలువ నీటిలో 100, 200, 500 నోట్ల కట్టలు విసిరినట్లు స్థానికులు చెబుతున్నారు.

 

Bundles of notes flow with water in this canal of Bihar KRJ

వర్షాలు బాగా కురిస్తే.. నదుల్లో, కాలువల్లో చేపలు కొట్టుక రావడం చూశాం. మరి భారీ వర్షాలు, వరదలు వచ్చే చెట్టు, గుడిసెలు కొట్టుకరావడం కూడా చూశాం.. కానీ ఎప్పుడైనా కాలువలో నోట్ల కట్టలు కొట్టుకురావటం ఎప్పుడైనా చూశారా..? వినడానికే ఆ ఊహా బాగుంది కాదా.. కానీ.. ఇలాంటి విచిత్రమైన దృశ్యం బీహార్‌లోని ఒక జిల్లాలో కనిపించింది.  

మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన బీహార్‌లోని ససారం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడి మొరాదాబాద్ లోని ఓ నీటి కాలువలో ఒక్కసారిగా నోట్ల కట్టలు తేలాయి. కొంతమంది కాలువ దగ్గరికి వెళ్లి చూడగా.. 100, 200, 500నోట్లు కనిపించాయి. ఆ నోట్ల కట్టలు చూసి వారు షాక్ తిన్నారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంది అక్కడి చేరారు. ఎంతదొరికితే అంత అన్నట్లుగా కాలువలోకి దూకి నానా ప్రయత్నాలు చేశారు. ఎవరి చేతికి ఎంత దొరికితే అంతా పట్టుకెళ్లారు. 

ఆ సమయంలో కొంతమంది.. బ్యాగుతో కాల్వలోకి దూకారు. ఇంకా కొంతమంది అయితే..తమ చొక్కాలను విప్పి బ్యాగులుగా చేసుకుని నోట్ల కట్టలను సేకరించే ప్రయత్నం చేశారు. ఇలా ఎంత దొరికితే అంత అన్నట్టుగా పోటీపడ్డారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.  

అయితే.. అయితే, ఈ నోట్ల కట్టలు నిజమైనవో.. నకిలీవో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు కాల్వలోకి ఎందుకు విసిరారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం.. ఆ నోటు నిజమేనని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతున్నా.. వారు మాత్రం బహిరంగంగా మాట్లాడడం లేదు. నోటు లభించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారని, అక్కడ ఏమీ కనిపించలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీస్ స్టేషన్ చీఫ్ చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios