Bullet resistant jacket: బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్.. దీనిని వీవీఐపీ రక్షణలో మరో 'గేమ్ ఛేంజర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. వీవీఐపీలు సూట్ పై ధరించేలా ప్రత్యేకంగా ఈ జాకెట్ ను రూపొందించారు. తేలికపాటి (1.8 కిలోలు) జాకెట్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రంగుల్లో అందుబాటులోకి ఉత్పత్తిదారులు తీసుకువచ్చారు.
Bullet resistant jacket-VVIP protection: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన పర్యావరణ అనుకూల సూట్ జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని గురించిన కథనాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు, సరికొత్త అత్యాధునిక సాంకేతికత సహాయంతో తయారు చేసిన మరో జాకెట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ జాకెట్ దేశంలో వీవీఐపీ రక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్.. దీనిని వీవీఐపీ రక్షణలో మరో 'గేమ్ ఛేంజర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. వీవీఐపీలు సూట్ పై ధరించేలా ప్రత్యేకంగా ఈ జాకెట్ ను రూపొందించారు. తేలికపాటి (1.8 కిలోలు) జాకెట్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రంగుల్లో అందుబాటులోకి ఉత్పత్తిదారులు తీసుకువచ్చారు.
ఇటీవల దీనిని ఏరో ఇండియా 2023 ఎయిర్ షో సందర్భంగా ప్రదర్శించారు. వీవీఐపీల కోసం బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్‌ను అభివృద్ధి చేసిన ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL) జనరల్ మేనేజర్-ఆపరేషన్స్ రాజీవ్ శర్మ.. ఏసియానెట్ న్యూస్ తో మాట్లాడుతూ ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, ఈ జాకెట్ ను అభివృద్ది చేసిన ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ సంస్థ. ఇది మునుపటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుండి వేరు చేయబడిన నాలుగు యూనిట్ల సమ్మేళనంతో కూడిన విభాగం.
వీవీఐపీలు సూట్ పై ధరించేలా ప్రత్యేకంగా ఈ జాకెట్ ను రూపొందించారు. తేలికపాటి (1.8 కిలోలు) జాకెట్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రంగుల్లో లభిస్తుంది. సాఫ్ట్ ఆర్మర్ ప్యానెల్ గా ఉపయోగించే అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఇత్లీన్ తో తయారు చేసిన ఈ జాకెట్ యూజర్ ను 9x19 ఎంఎం మందుగుండు సామాగ్రి (పిస్టల్స్ లేదా రివాల్వర్స్) నుంచి కాపాడుతుంది. అంటే ఇది ఒక బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ అన్నమాట !
ఈ (వీవీఐపీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్)తో టీసీఎల్ సివిల్ మార్కెట్లోకి కూడా విస్తరిస్తుందని రాజీవ్ తెలిపారు. "ఇప్పటి వరకు రక్షణ సేవలపై దృష్టి సారించాం. ఇప్పుడు సివిల్ మార్కెట్ లోనూ విస్తరిస్తున్నాం. ఈ ప్రొడక్ట్ ను అందరూ మెచ్చుకుంటున్నారు" అని ఆయన తెలిపారు. కాగా, ఏరో ఇండియా 2023 లో టీసీఎల్ భారత వైమానిక దళం ఉపయోగించగల ఐదు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిలో ఒకటి తేలికపాటి శీతాకాలంలో ఉపయోగించడానికి ఉద్దేశించిన కోట్ కాంబాట్ డిజిటల్. ఈ కోటు ఐఏఎఫ్ ఇటీవల ప్రవేశపెట్టిన యుద్ధ యూనిఫాం కోసం క్యామోఫ్లాజ్ డిజిటల్ నమూనాను ధృవీకరిస్తుంది.
అగ్ని నిరోధక, ఎత్తైన టెంట్లు, యుద్ధ బూట్లు, పారాచూట్లు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, ప్రస్తుతం సియాచిన్ లో ట్రయల్స్ లో ఉన్న ఎక్స్ టెండెడ్ కోల్డ్ వెదర్ కవరింగ్ సిస్టం లేదా ఈసీడబ్ల్యూసీఎస్ లను టీసీఎల్ ప్రదర్శించింది. మైనస్ 50 కంటే తక్కువ ఉష్ణోగ్రత, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే 18,000 అడుగుల ఎత్తులో ఈసీడబ్ల్యూసీఎస్ ను వినియోగించనున్నారు. ECWCS ఏడు లేయర్ లను కలిగి ఉంటుంది. ఎనిమిది విభిన్న కాంబినేషన్ లలో లభించే దీనికి త్వరలోనే భారత సైన్యం నుంచి ఆర్డర్ వస్తుందని టీసీఎల్ భావిస్తోంది.
