రాజస్తాన్‌లోని చౌము కోర్టుకు ఓ దొంగతనం కేసులో గేదెను కూడా తీసుకువచ్చారు. గేదెల చోరీ కేసులో సాక్షుల స్టేట్‌మెంట్ కోసం కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో సాక్షులతోపాటు గుర్తింపుకోసం గేదెను కూడా తీసుకువచ్చారు.
జైపూర్: రాజస్తాన్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గేదెల దొంగతనం కేసు కోర్టు విచారిస్తుండగా అక్కడికి బర్రెను కూడా ఓ ట్రాలీలో తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో పోస్టు చేశారు. అసలు కోర్టుకు బర్రెకు తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా మీ డౌటు.. లేటెందుకు పదండి తెలుసుకుందాం.
జైపూర్ జిల్లాలో చౌము అనే ఓ పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో సుమారు పదేళ్ల క్రితం మూడు గేదెలు చోరీ అయ్యాయి. ఈ దొంగతనానికి సంబంధించి హర్మదా పోలీసులకు ఫిర్యాదు అందింది. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మొత్తంగా రెండు గేదెలను పోలీసులు పట్టుకోగలిగారు. వాటిని యజమానికి అప్పగించారు. ఈ రెండింటిలో కొన్నేళ్ల క్రితం ఓ గేదె మరణించింది.
Also Read: రేణు దేశాయ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రామంబాబు రియాక్షన్ ఇదే
ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతూనే ఉన్నది. కేసు విచారణలో భాగంగా సాక్షులు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం కోసం కోర్టుకు హాజరు కావాలని ఇటీవలే సమన్లు అందాయి. అనంతరం, విచారణ రోజున సాక్షులతోపాటు గేదెను కూడా కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్ కోసం ఆ గేదెను కోర్టుకు తీసుకువచ్చినట్టు చెబుతున్నారు. గేదెను కోర్టుకు తీసుకురావడంతో కోర్టులో ఆసక్తికర చర్చ మొదలైంది.
